Jammu kashmir: జమ్మూకశ్మీర్‌లో 35 ఏళ్లలో అత్యధిక ఓటింగు

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అవుతోంది. ఇక్కడి అయిదు లోక్‌సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 58.46 శాతం ఓటింగు నమోదైంది. గడచిన 35 ఏళ్లలో  ఇదే అత్యధిక ఓటింగు శాతం.

Published : 28 May 2024 04:16 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అవుతోంది. ఇక్కడి అయిదు లోక్‌సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 58.46 శాతం ఓటింగు నమోదైంది. గడచిన 35 ఏళ్లలో  ఇదే అత్యధిక ఓటింగు శాతం. సెప్టెంబరు 30లోపు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరపాలని గతేడాది డిసెంబరు నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2019 ఆగస్టులో 370వ రాజ్యాంగ అధికరణాన్ని రద్దు చేసిన తరవాత అక్కడ ఇవే మొదటి అసెంబ్లీ ఎన్నికలవుతాయి. అధికరణం రద్దయిన తరవాత జమ్మూకశ్మీర్‌లో 5 లోక్‌సభస్థానాలను, లద్దాఖ్‌లో ఒక లోక్‌సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. కశ్మీర్‌ లోయలోని శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో 2019లో కేవలం 19.16 శాతం ఓట్లు పోలవగా.. ఈసారి అది 50.86 శాతానికి పెరిగింది. జమ్మూ ప్రాంతంలోని ఉధంపూర్, జమ్మూలలో వరుసగా 68.27 శాతం, 72.22 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటర్ల స్పందనను చూసి సంతృప్తి చెందిన సీఈసీ రాజీవ్‌కుమార్‌ కశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని