Uttam Kumar Reddy: సీఎం రేసులో నేనూ ఉన్నా: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పునరుద్ఘాటించారు.

Updated : 05 Dec 2023 18:21 IST

దిల్లీ: తెలంగాణ సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. పార్టీ హై కమాండ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవిని ముగ్గురు.. నలుగురు ఆశించడంలో తప్పు ఏంటని ప్రశ్నించారు. సీఎం ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్‌ సరైన పద్ధతి పాటిస్తోందని చెప్పారు.

‘‘ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా కాలేదు. సీఎం అభ్యర్థి ఖరారు ఆలస్యం అనడం సరికాదు. ఇవాళ ఉదయం డీకే శివకుమార్‌ను దిల్లీలో కలిశా. ఆయనకు నా అభిప్రాయం తెలియజేశాను. నేను కాంగ్రెస్‌ నుంచే 7 సార్లు వరుసగా గెలిచా. అలాంటప్పుడు సీఎం పదవిని ఆశించడంలో తప్పేముంది?ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి గందరగోళం లేదు’’ అని ఉత్తమ్‌ తెలిపారు.

కేసీ వేణుగోపాల్‌ నివాసంలో భేటీ

మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ భేటీలో పాల్గొన్నారు. మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు