Manish Sisodia: త్వరలో జైలు నుంచి బయటకు వస్తా: సిసోదియా

తాను త్వరలో జైలు నుంచి బయటకు వస్తానని దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్‌ సిసోదియా లేఖ రాశారు.

Updated : 05 Apr 2024 13:54 IST

దిల్లీ: తాను త్వరలో జైలు నుంచి బయటకు వస్తానని దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్‌ సిసోదియా లేఖ రాశారు. తన నియోజకవర్గ ప్రజలనుద్దేశించి జైలు నుంచి ఆయన రాసిన లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ‘‘గతంలో స్వాతంత్య్రం కోసం పోరాడినట్లే మన పార్టీ పిల్లలకు మంచి విద్య, పాఠశాలల కోసం పోరాడుతోంది. బ్రిటిష్ వారు కూడా ఇలాగే తప్పుడు కేసుల్లో మహాత్మా గాంధీని, నెల్సన్ మండేలాను జైల్లో పెట్టారు. మనం చేసే పోరాటం వల్ల ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ సరైన, మంచి విద్యను పొందుతారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే  మంచి పాఠశాలలు, విద్య అవసరం. అనారోగ్యంతో బాధపడుతున్న నా భార్యను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని త్వరలో బయట కలుస్తాను’’ అని లేఖలో పేర్కొన్నారు.

మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన సిసోదియా.. 13 నెలలుగా జైలులో ఉంటున్నారు. గత నెలలో ఇదే కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన మరో ఆప్ నేత సంజయ్ సింగ్ ఇటీవల విడుదలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని