Loksabha polls: సందేశ్‌ఖాలీకి వెళ్తాను: మమతా బెనర్జీ

ఎన్నికల వేళ అన్ని ప్రాంతాలతో పాటు సందేశ్‌ ఖాలీకి కూడా వెళ్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)అన్నారు. 

Published : 21 May 2024 19:50 IST

కోల్‌కతా: ఎన్నికల సమయంలో అన్ని ప్రాంతాలతో పాటు సందేశ్‌ ఖాలీ (Sandeshkhali)కి కూడా వెళ్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)అన్నారు.  బసిర్‌హత్‌ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. సందేశ్‌ఖాలీలో మహిళల పరిస్థితిపై మమత తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ‘‘సందేశ్‌ఖాలీలోని మహిళలకు జరిగిన అన్యాయానికి, అవమానానికి నన్ను క్షమించండి. ఈ విషయం నన్నెంతో బాధకు గురి చేసింది. మరొకసారి మహిళల గౌరవంతో ఆడుకోవడానికి ఎవరూ సాహసించకూడదు.’’అని ఆమె తెలిపారు. 

సందేశ్‌ఖాలీలో భాజపా ( BJP) భారీ కుట్రకు పాల్పడిందని మమత ఆరోపించారు. వాటికి సంబంధించిన వీడియోలు బయటకు రాకపోయుంటే  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ప్రజలకు ఎప్పటికీ అర్థం కావని ఆమె అన్నారు. స్థానిక భాజపా నాయకుడు మహిళలతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించి వాటిని తృణమూల్‌ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై తప్పుడు ఫిర్యాదులుగా మార్చారని మండిపడ్డారు. 

మహిళల భద్రతను పట్టించుకోని మోదీ( PM Modi), సందేశ్‌ ఖాలీ ఘటనపై స్పందించని మోదీ ఎన్నికల కోసం సందేశ్‌ఖాలీ బాధితులలో ఒకరైన రేఖా పాత్రోను తమ అభ్యర్థిగా ప్రకటించారని దుయ్యబట్టారు. భాజపా ప్రభుత్వ హయాంలో దేశంలో మహిళలకు భద్రత లేదనే విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దని సీఎం తెలిపారు. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. టీఎంసీ అభ్యర్థి హాజీ నూరుల్ ఎంపీగా గెలుపొందిన వెంటనే మొదటిగా సందేశ్‌ఖాలీని సందర్శిస్తానని, అక్కడి ప్రజలను కలుస్తానని మమత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని