Kishon reddy: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తాం: కిషన్‌రెడ్డి

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం చేస్తామని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 09 Jun 2024 16:37 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం చేస్తామని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్భంగా ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. సంకల్పపత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే అయిదేళ్లు అంకితభావంతో పని చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. రోడ్లు, రేషన్‌ బియ్యం, గ్రామాలకు మంచినీటి సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని, రాబోయే రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.

రాబోయే రోజుల్లో భాజపాను మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ పరిధిలో తన గెలుపు కోసం పని చేసిన పదాధికారులు, మోర్చాల అధ్యక్షులకు ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ముసుగులో మజ్లిస్‌ పోటీ చేసిందని, అయినప్పటికీ ప్రజలు ఆ కుట్రలను తిప్పికొట్టారన్నారు. మోదీ ప్రమాణస్వీకారం పూర్తికాగానే మేళతాళాలతో కార్యక్రమాలను నిర్వహించాలని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారని,  రాష్ట్రంలోనూ ఆ కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడిగా ఆదేశిస్తున్నట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు