Ysrcp: మంగళగిరి ఇన్‌ఛార్జిని మార్చిన వైకాపా

వైకాపాలో నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పులు కొనసాగుతున్నాయి.

Updated : 01 Mar 2024 22:44 IST

అమరావతి: వైకాపాలో నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఇన్‌ఛార్జ్‌గా వి.విజయసాయిరెడ్డిని నియమించారు. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి మురుగుడు లావణ్య, కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎండీ ఇంతియాజ్‌ను ఇన్‌ఛార్జులుగా నియమించినట్టు వైకాపా కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. 

మంగళగిరి నుంచి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పోటీ చేస్తుండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని ఓ వైపు కుటిల యత్నాలు చేస్తోన్న సీఎం జగన్‌.. దీని కోసం రకరకాల ఎత్తులు వేస్తున్నారు. మంగళగిరి ఇన్‌ఛార్జిలను ముచ్చటగా మూడోసారి మార్చారు. ప్రస్తుత ఇన్‌ఛార్జి గంజి చిరంజీవికి షాక్‌ ఇచ్చిన సీఎం.. ఆయన అభ్యర్థిత్వాన్ని తప్పించారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కేను సీఎంవోకు పిలిచి జగన్‌ చర్చించారు. అసంతృప్తితో ఉన్న ప్రస్తుత ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. లావణ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం.. కలిసికట్టుగా పనిచేసి ఆమెను గెలిపించుకు రావాలని ఆదేశించినట్టు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు