Lok Sabha Elections: ఫలితాలు వచ్చాక ఇండియా కూటమి నేతల భేటీ!

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సాయంత్రం ఇండియా కూటమి నేతలు భేటీ కావాలని నిర్ణయించారు!

Published : 03 Jun 2024 22:51 IST

దిల్లీ: యావత్‌ దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం నుంచే కౌంటింగ్‌ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల నుంచి ఫలితాలు వెలువడ్డాక మంగళవారం సాయంత్రం భేటీ కావాలని ‘ఇండియా’ కూటమి నేతలు నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో శనివారం భేటీ అయిన సందర్భంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే విపక్షాలు నిరసనలు చేపడతాయన్న ప్రచారంపై స్పందించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్.. ‘ఇండియా’ కూటమి నేతలు ఫలితాలు వెలువడ్డాక సమావేశమవుతాయని ‘ఎక్స్‌’వేదికగా వెల్లడించారు. 

మరోవైపు, తమ కూటమికి 295 సీట్లు వస్తాయని విపక్ష నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవల వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఎన్డీయే కూటమిదే విజయమని తేల్చి చెప్పడంతో వరుసగా మూడోసారి కూడా తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని అధికార భాజపా నేతలు విశ్వాసంతో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు