Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు షాక్‌.. లీడ్‌లో ఇండియా కూటమి!

Updated : 04 Jun 2024 11:58 IST

Uttar Pradesh | ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో (Uttar Pradesh) షాకింగ్‌ ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి చూస్తే.. అక్కడ భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి షాక్‌ తగులబోతోందని తెలుస్తోంది. ఇక్కడ ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.

80 లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో 2019లో భాజపా 62 స్థానాలు గెలుపొందింది. ఎన్డీయే కూటమికి చెందిన అప్నాదళ్‌కు 2 స్థానాలు వచ్చాయి. మాయవతి ఒంటరిగా పోటీ చేయగా.. ఆ పార్టీకి 10 స్థానాలు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీకి 5, కాంగ్రెస్‌ ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నాయి. 

ఈసారి అప్నాదళ్‌తో పాటు జయంత్‌ చౌదరి నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీ, సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ ఎన్డీయే కూటమిగా పోటీ చేశాయి. అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌ వాదీ పార్టీ 62 స్థానాలకు, కాంగ్రెస్ 17 స్థానాల్లో కలిసి పోటీ చేశాయి. బీఎస్పీ ఒంటరిగా బరిలో నిలిచింది.

ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి చూస్తే 80 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 38 స్థానాల్లో లీడ్‌లో ఉండగా.. ఇండియా కూటమి 41 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ఇతరులు 1 స్థానంలో లీడ్‌లో ఉన్నారు. బీఎస్పీ ఒక్క చోట కూడా ఖాతా తెరవ లేదు. గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ భారీగా సీట్లను కోల్పోబోతోందని అర్థమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని