Ponguleti Srinivas Reddy: ఐటీ దాడులు.. కుట్రపూరితం: పొంగులేటి

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి.

Updated : 09 Nov 2023 22:05 IST

ఖమ్మం: మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. ఖమ్మంలోని ఆయన నివాసంలో సోదాలు పూర్తి అయిన అనంతరం విచారణ నిమిత్తం హైదరాబాద్‌ రావాలని ఆయన కుటుంబసభ్యులకు ఐటీ అధికారులు సూచించారు. ఐటీ అధికారుల సూచనతో పొంగులేటి సతీమణి, కుమారుడు, సోదరుడు హైదరాబాద్‌ బయలుదేరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఐటీ దాడులున్నాయి. వందల మంది ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. 30కిపైగా ప్రాంతాల్లో సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఐటీ దాడులకు పురిగొల్పాయి’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని