Janasena: తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్‌.. మహిళల గురించి చెప్పడమా?: కందుల దుర్గేష్‌

తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన జగన్‌.. మహిళల గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌ విమర్శించారు.

Updated : 12 Oct 2023 18:02 IST

కాకినాడ: తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన జగన్‌.. మహిళల గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌ విమర్శించారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో జగన్‌.. సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘మహిళలను ఆట వస్తువులా భావించి వికృత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం. ప్రసంగంలో సగం సమయం జనసేనని విమర్శించడానికే కేటాయిస్తున్నారు. పేదల పక్షాన నిలబడే మా నాయకుడు నిజంగా పేదవాడే. నీకు మాత్రం హైదరాబాద్‌, బెంగళూరు, కడపలోనూ ఆస్తులు ఉండొచ్చు.. మిగిలిన వారికి ఎవరికీ ఉండకూడదా? ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. జనసేన-తెదేపా పొత్తును చూసి జగన్‌కు వణుకు పుట్టింది. బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారు.. జగన్‌ మాత్రం హెలికాప్టర్‌లో దిగుతారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసే హక్కు అందరికీ ఉంది. అందులో భాగంగానే లోకేశ్‌.. అమిత్‌ షాను కలిశారు. రాజకీయాల్లో పొత్తులు సహజం. రాక్షస సంహారం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ కలుస్తారు’’ అని దుర్గేశ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని