Jeevan Reddy: అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్‌ ప్రభుత్వం: జీవన్‌రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 18 May 2024 14:30 IST

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణమన్నారు. ఇది మత విశ్వాసాలను రెచ్చగొట్టడమేనన్నారు. ప్రధాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుల్డోజర్‌ను తెర మీదకు తీసుకువచ్చింది భాజపానే అని వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్‌ గాంధీ ప్రభుత్వమని తెలిపారు. ఆయన బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు. 

ఎన్నికల కోసం దేవుడిని వాడుకోవడం మంచిది కాదన్నారు. మత సామరస్యానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు దూరదర్శన్‌లో రామాయణ, మహాభారతాలు ప్రసారం చేశారని వివరించారు. ప్రస్తుతం మోదీ వచ్చాకే రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది అన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోర్టు తీర్పు ప్రకారమే రామ మందిర నిర్మాణం జరిగిందన్నారు. మతం పేరుతో భాజపా రాజకీయం చేస్తోందని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీ దేశాన్ని నాశనం చేస్తోందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని