KA paul: భారాస, కాంగ్రెస్‌ ఒక్కటే: కేఏ పాల్‌

కాంగ్రెస్‌లో ఉన్న భారాస మద్దతుదారులను గెలిపించుకునేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శించారు.

Published : 12 Oct 2023 15:10 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భారాస కుటుంబ అక్రమ, అవినీతి పాలన కొనసాగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA Paul) విమర్శించారు. ఈ పాలనను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న భారాస మద్దతుదారులను గెలిపించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లను భారాస నుంచి నుంచి రాజీనామా చేయించి కాంగ్రెస్‌లో చేర్పించారని అన్నారు.

‘‘తెజస, వైతెపాలను కూడా కాంగ్రెస్‌ వాడుకుంది. నవంబర్‌ 30న కేసీఆర్‌కి గుడ్‌బై చెప్పాలంటే.. ముందు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పాలి. ఎక్కువ శాతం ఉన్న  బీసీల నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా లేరు. 60శాతం ఉన్న బీసీలకు 60శాతం సీట్లు ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నా. పోటీ చేయాలనుకున్న వారు వారం రోజుల్లోగా రూ.10 వేలు గూగుల్‌పే చేసి, దరఖాస్తు పంపండి. భారాస, కాంగ్రెస్‌ ఒక్కటే.  కేసీఆర్‌పై 7 కేసులు వేశాను. దీంతో కేటీఆర్‌ నాపై దాడి చేయించారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తున్నాం. టికెట్ల కోసం అన్ని కులాల వారు ఎవర్నీ అడగొద్దు. ప్రజాశాంతి పార్టీ సిద్ధంగా ఉంది. వారం రోజుల్లోగా జాబితా విడుదల చేస్తాం. భారాస ఇస్తున్న పథకాలన్నింటికీ రెండు రెట్లు ఇస్తాం. పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటి వరకు 3600 మంది దరఖాస్తు చేశారు’’ అని కేఏ పాల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు