సీఎం రేవంత్‌ను కలిసిన కేఏ పాల్‌.. ప్రపంచ శాంతి సదస్సుకు రావాలని ఆహ్వానం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA Paul) మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 25 Dec 2023 18:55 IST

(ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA Paul) సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని కేఏ పాల్ తెలిపారు. సదస్సుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు వివరించారు. పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు కేఏ పాల్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని