నన్నెందుకు పిలవలేదు.. సచివాలయం మెట్లపై కూర్చొని కేఏ పాల్‌ నిరసన

ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవటంపై సచివాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసనకు దిగారు.

Updated : 07 Mar 2024 18:58 IST

అమరావతి: ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవటంపై సచివాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసనకు దిగారు. తొలుత సచివాలయం ప్రధాన గేట్ వద్ద ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగడంతో అనుమతించారు. అయితే, సీఈవో ముఖేశ్‌ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని, ఇప్పుడు కలవలేరని సిబ్బంది పాల్‌కు తెలిపారు. దీంతో ఆయన ఐదో బ్లాక్ మెట్ల వద్దే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సీఈవో కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వీల్లేదని భద్రతా సిబ్బంది ఆయనను బయటకు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు