KCR: సీఎం రేవంత్‌రెడ్డికి భారాస అధినేత కేసీఆర్‌ 22 పేజీల సుదీర్ఘ లేఖ

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారాస అధినేత కేసీఆర్‌ 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు.

Published : 01 Jun 2024 18:19 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారాస అధినేత కేసీఆర్‌ 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రావాలని ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన  బహిరంగ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితం.. అమరుల త్యాగాల పర్యవసానం. కానీ, కాంగ్రెస్‌ దయాభిక్షగా మీరు చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తున్నాను. 1969 నుంచి ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్నమార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం. 1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నది ఆదిగా.. కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజకరమైన సందర్భమే. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్‌ పాల్గొనడం సమంజసం కాదని భారాస, తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉంది’’ అని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని