మీ పార్టీ కార్యాలయానికి వస్తా

భాజపా ప్రధాన కార్యాలయానికి ఆదివారం తాను తమ పార్టీ నేతలతో కలిసి వెళ్తానని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ శనివారం ప్రకటించారు. ఆ సందర్భంగా ఎవరిని కోరుకుంటే వారిని ప్రధానమంత్రి జైలుకు పంపించుకోవచ్చని పేర్కొన్నారు.

Updated : 19 May 2024 05:50 IST

 మా పార్టీ నేతలనూ తీసుకొస్తా 
మాలో ఎవరినైనా అరెస్టు చేసుకోవచ్చు
ప్రధానమంత్రికి కేజ్రీవాల్‌ సవాల్‌

దిల్లీ: భాజపా ప్రధాన కార్యాలయానికి ఆదివారం తాను తమ పార్టీ నేతలతో కలిసి వెళ్తానని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ శనివారం ప్రకటించారు. ఆ సందర్భంగా ఎవరిని కోరుకుంటే వారిని ప్రధానమంత్రి జైలుకు పంపించుకోవచ్చని పేర్కొన్నారు. ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డా, దిల్లీ మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌లను జైలుకు పంపడం ఖాయమని భాజపా పేర్కొంటున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ స్పందించారు.  మనీశ్‌ సిసోదియా, సత్యేంద్ర జైన్, సంజయ్‌ సింగ్‌లను పంపినట్లుగా ఆప్‌ నేతలను జైలుకు పంపడమనే ఆటను ప్రధాని ఆడుతున్నారని ఆరోపించారు. ‘‘ఆదివారం మా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలంతా కలిసి భాజపా కార్యాలయానికి వెళ్తాం. ప్రధాని  మాలో ఎవరిని జైలుకు పంపాలనుకుంటున్నారో వారిని పంపించుకోవచ్చు. ఆప్‌ అనేది ఓ సిద్ధాంతం. ఎంతమంది నేతలను మీరు జైలుకు పంపితే..దేశం అంతకు వంద రెట్లు నేతలను తయారు చేస్తుంది’’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని