Keshav Rao: కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు

తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు.

Updated : 29 Mar 2024 18:39 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. దిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అతి త్వరలో తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి సొంతగూటికి చేరుతున్నట్లు చెప్పారు. అవసరమైతే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి చేరుతానని వెల్లడించారు.

‘‘తెలంగాణ గురించి తెరాస కంటే ముందే కాంగ్రెస్‌ ఆలోచించింది. కాంగ్రెస్‌ ఫోరం ఫర్‌ తెలంగాణ ముందే ఆలోచించింది. బాగారెడ్డి ఛైర్మన్‌గా సీఎఫ్‌టీ ఏర్పాటు జరిగింది. రాజీనామా చేస్తామని 42 మంది ఎమ్మెల్యేలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తెలంగాణ కోసం చాలా మంది నాయకులు నిరాహార దీక్షలు చేశారు. అందరికంటే ముందు కృష్ణారావు రాజీనామా చేశారు. 1998 నుంచి తెలంగాణ గురించి పోరాటం మొదలైంది. ఆరు వర్కింగ్‌ కమిటీలు ఏర్పాటయ్యాయి. వార్‌ గ్రూపులో నేను సభ్యుడిగా కూడా పనిచేశా.

భారాసను కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉంది. ఏం చేసినా క్యాడర్‌ను దూరం చేసుకోకూడదు. భారాస, కేసీఆర్‌ ఇచ్చిన గౌరవం మరిచిపోలేను. కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస సరిచేసుకోలేదు. ఘర్‌ వాపస్‌ కావాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రసంగాలు సౌమ్యంగా చేసుకుంటే బాగుండేది’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని