Kiran Kumar Reddy: కాంగ్రెస్‌ పార్టీకి మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి రాజీనామా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

Updated : 12 Mar 2023 22:33 IST

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి భాజపాలో చేరనున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలుస్తారని ప్రచారం జరుగుతోంది.

కిరణ్‌కుమార్‌రెడ్డి 1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌ పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. తర్వాత 1994లో ఓడిపోయినా.. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2004లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 19 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని