Kishan Reddy: భయానక పరిస్థితుల్లో మూసీ పరివాహక ప్రజలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్: పేదలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అక్కడి ప్రజలు భయానక పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. సుమారు 10 మంది గుండె పోటుతో మృతి చెందారని తెలిపారు. ప్రజాపాలన అంటే ఇళ్లు కూలగొట్టడమా అని ప్రశ్నించారు. మూసీలోకి మురికి నీరు రాకూడదంటే రూ.వేల కోట్లు కావాలన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసీకి.. కృష్ణా, గోదావరి జలాలు ఎలా తెస్తారో చెప్పాలన్నారు. ఇళ్లు కూల్చకుండా దీన్ని అభివృద్ధి చేయాలని కిషన్‌రెడ్డి (Kishan Reddy) చెప్పారు.

సుందరీకరణ అంటే ఇళ్లు కూల్చడం కాదు: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మూసీ సుందరీకరణకు భాజపా వ్యతిరేకం కాదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) తెలిపారు. కానీ ఇందు కోసమని చెప్పి పేదల ఇళ్లు కూలుస్తామంటే ఊరుకోమన్నారు. ప్రజలు ఒప్పుకొంటే మూడింతల పరిహారం ఇచ్చి తీసుకోవాలన్నారు. మూసీ సుందరీకరణ అంటే ఇళ్లు కూల్చడం కాదు.. నీటిని శుద్ధి చేయడం అని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 - 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 - 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 


