Kishan Reddy: గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్‌రెడ్డి

గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. 

Published : 18 Apr 2024 15:16 IST

హైదరాబాద్‌: గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ కూడా లేదన్నారు. ఎవరినీ బెదిరించలేదని, ఎవరిపైనా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని చెప్పారు. తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అభివృద్ధి కోసం పని చేశానని భావిస్తేనే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని