Kishan Reddy: గవర్నర్‌ తమిళిసై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్‌రెడ్డి

నామినేటెడ్‌ ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్‌ తమిళిసై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Published : 25 Sep 2023 19:48 IST

హైదరాబాద్‌: నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్‌ తమిళిసై (Tamilisai) నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నామినేటెడ్‌ కోటాలో కవులు, కళాకారులు, సేవ చేసేవారికి గవర్నర్‌ అవకాశం కల్పిస్తారని, సీఎం కేసీఆర్‌ మాత్రం క్రిమినల్‌ కేసులు ఉన్న వ్యక్తులను నియమించాలని చూస్తున్నారని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.వి.సుభాష్‌తో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం కోసం పని చేసేవారికి ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలు ఫిరాయించిన వారిని, కేసీఆర్ కుటుంబానికి సేవచేసే వారిని గవర్నర్‌ తిరస్కరించడం మంచి నిర్ణయమన్నారు. ‘కేసీఆర్‌కు వత్తాసు పలికితే మంచివారు.. లేదంటే చెడ్డ వాళ్లా?’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని