హరీశ్‌ కాంగ్రెస్‌లోకి రావాలి.. పాపాలు కడుక్కోవడానికి దేవాదాయశాఖ ఇస్తాం: రాజగోపాల్‌రెడ్డి

భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రెస్‌లోకి వస్తే తీసుకుంటామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Updated : 12 Feb 2024 18:05 IST

హైదరాబాద్‌: ‘మాజీ మంత్రి హరీశ్‌రావు.. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్‌గా ఆయన మాట్లాడారు. భారాసలో ఉన్నా హరీశ్‌కు ప్రయోజనం లేదని.. కాంగ్రెస్‌లోకి వస్తే తీసుకుంటామని చెప్పారు. ఇందుకు 25 మంది భారాస ఎమ్మెల్యేలతో పార్టీలోకి రావాలని షరతు పెట్టారు. అప్పుడు ఆయనకు దేవాదాయశాఖ ఇస్తామన్నారు. భారాస హయాంలో చేసిన పాపాలను కడుక్కోవడానికి ఈ మంత్రి పదవి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

‘‘హరీశ్‌, కడియంలా మేము జీ హుజూర్ బ్యాచ్ కాదు. మేం పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్లం. ఉద్యమ సమయంలో పదవులను వదులుకున్న చరిత్ర మాది. భారాస చీప్‌ పాలిటిక్స్‌ మానుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారు. గతంలో మాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ నాశనం చేశారు. ఇప్పుడు తెలంగాణను కాపాడుకునే బాధ్యత మాపై పడింది. భారాస నల్గొండ సభకు జనం వచ్చే అవకాశం లేదు.. అట్టర్‌ ఫ్లాప్‌ అవుతుంది. కేటీఆర్‌కు దమ్ముంటే పార్టీని నడపాలి. హరీశ్‌ను మా పార్టీలోకి రమ్మంటున్నాం.. ఆయన కష్టపడతారు.. అక్కడ భవిష్యత్‌ లేదు’’ అని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని