Komatireddy Venkat Reddy: ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మొద్దు: మంత్రి కోమటిరెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నల్గొండ జిల్లాలో తొలుత 2 వేల ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Published : 03 Mar 2024 13:30 IST

నల్గొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నల్గొండ జిల్లాలో తొలుత 2 వేల ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో ఆయన పర్యటించారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో పాటు గృహజ్యోతి లబ్ధిదారులతో మాట్లాడారు. బైక్‌పై తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ నెల 11న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేశామన్నారు. ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. తెలంగాణను భారాస అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని