Lok Sabha: లోక్‌సభలో భాజపా విప్‌గా చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి

Eenadu icon
By Politics News Team Published : 29 Jul 2024 20:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: లోక్‌సభలో తమ పార్టీ తరఫున చీఫ్‌ విప్‌, విప్‌లను భాజపా నియమించింది. చీఫ్‌ విప్‌, 16మంది విప్‌లను నియమించినట్లు భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. చీఫ్‌ విప్‌గా డా.సంజయ్‌ జైశ్వాల్‌ను నియమించగా.. విప్‌లుగా తెలంగాణకు చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డితో పాటు పలువురిని నియమించింది. విప్‌లుగా నియమితులైన వారిలో భాజపా ఎంపీలు దిలీప్‌ సైకియా, గోపాల్‌జీ ఠాకూర్‌, సంతోష్‌ పాండే, కమల్‌జీత్‌ షెరావత్‌, ధావల్‌ లక్ష్మణ్‌భాయి పటేల్‌, దేవుసిన్హ్‌ చౌహాన్‌, జుగల్‌ కిశోర్‌ శర్మ, కోట శ్రీనివాస్‌ పుజారి, సుధీర్‌ గుప్తా, స్మిత ఉదయ్‌ వాఘ్‌, అనంత నాయక్‌, దామోదర్‌ అగర్వాల్‌, సతీశ్‌ కుమార్‌ గౌతమ్‌, శశాంక్‌ మణి, ఖగెన్‌ ముర్ము నియమిస్తున్నట్లు భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కార్యదర్శి డా.శివ్‌ శక్తినాథ్ బక్షి ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు