KTR: రాజకీయ ప్రతీకారమే వారి లక్ష్యం.. కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించిన కేటీఆర్‌

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టును భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు.

Published : 22 Mar 2024 00:08 IST

హైదరాబాద్‌: దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టును భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. భాజపా చేతిలో అణచివేతకు ఈడీ, సీబీఐ సాధనాలుగా మారాయని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను నిరాధారమైన ఆరోపణలతో టార్గెట్ చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రతీకారమే వారి ఏకైక లక్ష్యమని ట్వీట్‌ చేశారు. దిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్‌ ఇంట్లో గురువారం సాయంత్రం సోదాలు జరిపిన ఈడీ అధికారులు ఆయన్ను విచారించిన తర్వాత అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, కాంగ్రెస్‌, డీఎంకే, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ సహా పలు విపక్షాలు కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించాయి. పలు రాష్ట్రాల్లో ఆప్‌ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు కేంద్రం ఈడీని ప్రయోగిస్తోందని మండిపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఇలాంటి చర్యలకు దిగడమంటే.. రాజకీయ కక్షసాధింపు చేయడం ద్వారా విపక్షాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేనని నేతలు విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని