KTR: నేతన్నలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష కట్టింది: కేటీఆర్‌

నేతన్నలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష కట్టిందని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. వారు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు.

Updated : 04 Apr 2024 15:00 IST

హైదరాబాద్‌: నేతన్నలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష కట్టిందని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. వారు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ విధానాలు నేతన్నల బతుకులు ఆగమయ్యేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు నిలిపివేసిందన్న ఆయన.. గతంలో మాదిరిగా వారికి చేతినిండా ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

‘‘బతుకమ్మ చీరలు ఆర్డర్‌ ఇవ్వాలి. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి. ‘చేనేతమిత్ర’ వంటి పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్టకొట్టడం సరికాదు. వారు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. వస్త్ర పరిశ్రమను ఆదుకోకుంటే కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించక తప్పదు’’ అని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

మున్సిపల్‌ శాఖ సిగ్గు పడాల్సిన పరిస్థితి

నల్గొండ జిల్లా నందికొండ వాటర్‌ ట్యాంక్‌లో వానరాల కళేబరాలు బయటపడిన అంశంపై కేటీఆర్‌ స్పందించారు. ఇది మున్సిపల్‌ శాఖ సిగ్గుపడాల్సిన విషయమని విమర్శించారు. తాగునీటి ట్యాంకుల నిర్వహణలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘‘ఈ ప్రభుత్వం.. ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోంది. కాంగ్రెస్‌ పాలన అస్తవ్యస్తంగా మారింది’’ అంటూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని