KTR: వరి మాత్రమే సరిపోదు.. ఆయిల్‌పామ్‌ పండించాలి: కేటీఆర్‌

వ్యవసాయంలో తెలంగాణ దూసుకుపోతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 29 Sep 2023 13:11 IST

సంకిరెడ్డిపల్లి: వ్యవసాయంలో తెలంగాణ దూసుకుపోతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘లక్షల టన్నుల వంట నూనె దిగుమతి చేసుకుంటున్నాం. రైతులు వరి మాత్రమే పండిస్తే సరిపోదు.. ఆయిల్‌పామ్‌ పండించాలని ప్రోత్సహిస్తున్నాం. 20లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు లక్ష్యంగా పెట్టుకున్నాం.  మంత్రి నిరజన్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆయిల్‌ పామ్‌ను సాగు చేస్తున్నారు. ఆయిల్‌ పామ్‌ను సాగు చేస్తే ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది’’ అని కేటీఆర్‌ తెలిపారు.

కేటీఆర్‌ను కలిసిన అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు

అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో హైదరాబాద్‌ వృద్ధికి ఇది సంకేతమన్నారు. అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకరిస్తామని కేటీఆర్‌ తెలిపారు. గ్లోబల్‌ ప్రైవేటు ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ రాష్ట్రంలో సుమారు ₹16,650కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈమేరకు సంస్థ విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలను కేటీఆర్‌కు ఎండీ పంకజ్‌ పట్వారీ, ప్రతినిధులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని