KTR: సీఎం, మంత్రులను హరీశ్‌రావు ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు: కేటీఆర్‌

కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో జరిగిన చర్చపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా స్పందించారు.

Published : 12 Feb 2024 19:37 IST

హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో జరిగిన చర్చపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా స్పందించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తన అద్భుత ప్రసంగంతో శాసనసభలో ఒంటిచేత్తో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులందరినీ ఎదుర్కొన్నారని చెప్పారు. కృష్ణా జలాలు, కేఆర్‌ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం, అబద్ధాలను తిప్పికొట్టారని పేర్కొన్నారు. రేపటి ‘చలో నల్గొండ’కు హరీశ్‌రావు సరైన టోన్‌ సెట్‌ చేశారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నల్గొండ వేదికగా కేసీఆర్ తనదైన శైలిలో ఎండగడతారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని