హోంగార్డు కుటుంబానికి రూ.50లక్షల పరిహారమివ్వాలి: కూనంనేని

హోంగార్డులను పోలీసు అధికారులు పని మనుషుల్లా వాడుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

Published : 08 Sep 2023 14:51 IST

హైదరాబాద్‌: హోంగార్డులను పోలీసు అధికారులు పని మనుషుల్లా వాడుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్య చేసుకోలేదని.. ప్రభుత్వమే హత్య చేసిందన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో కూనంనేని మాట్లాడారు. హోంగార్డులను ప్రభుత్వం రెగ్యులర్‌ చేసి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రవీందర్‌ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అతడి భార్య సంధ్యకు తగిన న్యాయం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని