TSRTC-CPI: ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తోంది: కూనంనేని

ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుపై సంతకం పెట్టేందుకు గవర్నర్ కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

Updated : 17 Aug 2023 21:45 IST

హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుపై సంతకం పెట్టేందుకు గవర్నర్ కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లుల సమ్మతిపై ఆలస్యం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఉభయ సభల్లో ఆమోదించిన బిల్లుపై పది రోజులు దాటినా ఎందుకు ఆమోదముద్ర వేయడం లేదని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

ఈ బిల్లుపై అంగీకారం తెలిపేందుకు జరుగుతున్న జాప్యం సుమారు 43వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తుందన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆటంకాలు కల్పించకుండా తెలంగాణకు పునర్విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని