Lalan Singh: జేడీయూ కొత్త అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌ ఏకగ్రీవ ఎన్నిక

జనతాదళ్‌ (యూ) నూతన అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌(Lalan singh) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన జేడీయూ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

Published : 06 Dec 2022 01:04 IST

దిల్లీ: జనతాదళ్‌ (యూ) నూతన అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌(Lalan singh) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన జేడీయూ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. తమ పార్టీ కొత్త అధ్యక్షుడిగా రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (లలన్‌ సింగ్‌) ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జేడీయూ ప్రధాన కార్యదర్శి అఫాక్‌ అహ్మద్‌ వెల్లడించారు. పార్టీ అగ్రనేత, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన లలన్‌ సింగ్‌..  ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగానూ ఉన్నారు. ఇటీవల ఆర్సీపీ సింగ్‌ జేడీయూకు రాజీనామా చేయడంతో నూతన అధ్యక్షుడి నియామక ప్రక్రియ చేపట్టారు. అయితే, సోమవారంతో నామినేషన్ల గడువు పూర్తి కావడంతో బరిలో లలన్‌ సింగ్‌ ఒక్కరే నిలిచారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు జేడీయూ నేతలు తెలిపారు. జేడీయూ అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌ ఎన్నికను ఆమోదించేందుకు ఆ పార్టీ జాతీయ కౌన్సిల్‌ ఈ నెల 10న పట్నాలో భేటీ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు