AP News: సీఎం జగన్‌ విశ్వాస ఘాతుకానికి ట్రేడ్‌మార్క్‌: లంకా దినకర్‌

సీఎం జగన్‌ విశ్వాస ఘాతుకానికి ట్రేడ్‌మార్క్‌ అని భాజపా నేత లంకా దినకర్‌ అన్నారు.

Updated : 30 Mar 2024 16:13 IST

విజయవాడ: సీఎం జగన్‌ విశ్వాస ఘాతుకానికి ట్రేడ్‌మార్క్‌ అని భాజపా నేత లంకా దినకర్‌ అన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా అరాచక, విధ్వంసక పాలన చూశామన్నారు. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడి కలబోతే జగన్‌ అని అన్నారు. త్రిమూర్తుల కలయికతో రాక్షస పాలన సంహారం తథ్యమని చెప్పారు. సీఎం తట్టా బుట్టా సర్దుకుని నచ్చిన ప్యాలెస్‌కు వెళ్లడం మంచిదని హితవు పలికారు.

‘‘ఒకసారి వైకాపాకు ఓటు వేస్తే రాష్ట్రం రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు మరోసారి ఓటు వేస్తే శతాబ్దం వెనక్కి పోతుంది. 2019కి ముందు అమరావతే రాజధాని అంటూ 2024 నాటికి నిర్వీర్యం చేశారు. మద్య నిషేధం అంటూనే దాన్నే ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్ అంటూనే వారిని బానిసలకన్నా హీనంగా చూస్తున్నారు. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటూ ఉప ప్రణాళిక నిధులు గోల్‌మాల్‌ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు, పథకాలకు పేర్లు మార్చి జగన్‌ స్టిక్కర్లు వేసుకున్నారు. గడిచిన ఐదేళ్లలో కేంద్రం పంపించే నిధులకు బటన్ నొక్కడం తప్ప ఏం చేయలేదు. రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పులకు చేర్చిన ఘనత ఆయనకు దక్కింది’’ అని లంకా దినకర్‌ మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని