Pawan Kalyan: నేను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చూపిస్తా: పవన్‌ కల్యాణ్‌

తాను ఏదైనా మాటల్లో చెప్పనని.. నిలబడి చూపిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు..

Updated : 02 Dec 2023 14:52 IST

మంగళగిరి: తాను ఏదైనా మాటల్లో చెప్పనని.. నిలబడి చూపిస్తానని జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. జనసేన కార్యకర్తలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడ్డామన్నారు. పవన్‌ సమక్షంలో శనివారం పలు పార్టీలకు చెందిన నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో చేరేందుకు చాలా మంది వస్తున్నారని.. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

‘‘నిర్ణయాత్మక శక్తి ఉంటేనే ఏదైనా సార్థకమవుతుంది. విధానాలు రూపొందించే అధికారం రావాలి. బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు వారికే ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికే వెళ్లాలి. ఎవరికైతే కేటాయించారో వారికే ఆ నిధులు వెళ్లాలి. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టా. అణగారిన, అధికారం చూడని వర్గాలకు సాధికారత రావాలి’’ అని పవన్‌ ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని