Bhatti Vikramarka: అంబేడ్కర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.

Published : 14 Apr 2024 12:34 IST

ఖమ్మం: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అంబేడ్కర్‌ అందించిన సేవలను నేతలు కొనియాడారు.

అంబేడ్కర్‌ పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు

కొంతమంది అంబేడ్కర్‌ పేరును అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశిరావు విమర్శించారు. రాజ్యాంగానికి భాజపా తూట్లు పొడిచిందన్నారు. మూడోసారి ఆ పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. దాన్ని బతికించుకోవడమే మనం అంబేడ్కర్‌కు ఇచ్చే నివాళి అని చెప్పారు.

సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు 

సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు అంబేడ్కర్‌ అని తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వం లేకపోవడానికి బిలియనీర్లే కారణమని విమర్శించారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని.. సరైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని