రేపే ఐదో విడత.. 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌

సార్వత్రిక సమరంలో మరో కీలక దశకు రంగం సిద్ధమైంది. ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ సీట్లకు సోమవారం పోలింగ్‌ జరగనుంది.

Updated : 19 May 2024 02:56 IST

ముంబయి, లఖ్‌నవూ: సార్వత్రిక సమరంలో మరో కీలక దశకు రంగం సిద్ధమైంది. ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ సీట్లకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (రాయ్‌బరేలీ)తోపాటు రాజ్‌నాథ్‌ సింగ్‌ (లఖ్‌నవూ), పీయూష్‌ గోయల్‌ (ముంబయి-ఉత్తర), స్మృతి ఇరానీ (అమేఠీ), సాధ్వీ నిరంజన్‌ జ్యోతి (ఫతేహ్‌పుర్‌), శంతను ఠాకుర్‌ (బన్‌గావ్‌) తదితర కేంద్రమంత్రులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా స్థానం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ అగ్రనేత ఒమర్‌ అబ్దుల్లా సహా మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

బెంగాల్‌లో భద్రత కట్టుదిట్టం 

పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఏడు లోక్‌సభ స్థానాల్లో ఓటింగ్‌ జరగనుంది. వాటిలోని 57% పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైనవిగా వర్గీకరించారు. ఈ నేపథ్యంలో ఘర్షణలను నివారించేందుకు ఈసీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. మరోవైపు- ఒడిశాలో సోమవారం పోలింగ్‌ జరగనున్న 35 అసెంబ్లీ స్థానాలకు కూడా ప్రచార గడువు శనివారంతో ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని