Lok sabha election results: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. కీలక రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..

Lok Sabha Election Results: దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కీలక రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..

Updated : 04 Jun 2024 10:56 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Election Results) కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల సరళి ప్రకారం అత్యధిక లోక్‌సభ స్థానాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ముందంజలో కొనసాగుతోంది. ఆధిక్యాల్లో ఈ కూటమి ఇప్పటికే మెజారిటీ మార్క్‌ దాటింది. మరోవైపు ఇండియా కూటమి సైతం దాదాపు 200కు పైగా సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కీలక రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఫలితాల ట్రెండ్స్‌ ఎలా ఉన్నాయో చూద్దాం..

  • దిల్లీని ఎన్డీయే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్‌సభ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌, ఆప్‌తో కూడిన ఇండియా కూటమిపై భాజపా బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం ఎన్డీయే కూటమి ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది. ఇండియా కూటమి కేవలం ఒకదాంట్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 
  • అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఎన్డీయే కూటమి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి 37 సీట్లలో ముందంజలో ఉంది. ఆరంభ ట్రెండ్స్ ప్రకారం.. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి ఇక్కడ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
  • పశ్చిమ బెంగాల్‌లో పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ రాష్ట్రాన్ని భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 42 స్థానాలుండగా.. ఎన్డీయే 16, ఇండియా కూటమి 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
  • లైంగిక దౌర్జన్యం కేసుతో కర్ణాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం.. అక్కడ ఎన్డీయే కూటమి 17 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి 11 స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తోంది.
  • 25 స్థానాలున్న రాజస్థాన్‌లో గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పూర్తిగా క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈసారి మాత్రం ఇరు కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎన్డీయే 13, ఇండియా 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు