AAP: ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఆప్‌

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ కొత్త ఆలోచనతో ప్రజల ముందుకువచ్చింది. బుధవారం రామనవమిని పురస్కరించుకొని ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్‌సైట్‌ను ఆప్‌ ప్రారంభించింది. 

Published : 17 Apr 2024 15:51 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓ కొత్త ఆలోచనతో ప్రజల ముందుకువచ్చింది. బుధవారం రామనవమిని పురస్కరించుకొని ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్‌సైట్‌ను ఆప్‌ ప్రారంభించింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో రాముడి ఆదర్శాలను సాకారం చేసేందుకు ప్రయత్నించారని, రామరాజ్యాన్ని స్థాపించడానికి కృషి చేశారని పార్టీ పేర్కొంది.

విలేకరుల సమావేశంలో రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ‘రామరాజ్యం’ సాకారం కోసం గత 10 ఏళ్లలో ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించారు. మంచి పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లు, ఉచిత నీరు, విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలైన పథకాలను అందించారు. ‘రామరాజ్యం’ వెబ్‌సైట్‌ పార్టీ ప్రజల కోసం చేసిన పనిని తెలియజేస్తుంది. శ్రీరామనవమి రోజున కేజ్రీవాల్ తన ప్రజల మధ్య లేకపోవడం ఇదే మొదటిసారి. కొందరు తమ కుట్రలో భాగంగా ‘తప్పుడు’ సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిరాధారమైన కేసులో కేజ్రీవాల్‌ను జైలుకు పంపారు.’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని