Lokesh: జగన్‌ అహంకార ధోరణే ఆయన్ను గద్దె దించింది

జగన్‌ అహంకార ధోరణే ఆయన్ను గద్దె దించిందని తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన నారా లోకేశ్‌ అన్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమే ఈ విజయమని స్పష్టం చేశారు.

Published : 06 Jun 2024 04:07 IST

ఈ విజయం సమష్టి కృషి
గెలిచిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలతో లోకేశ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: జగన్‌ అహంకార ధోరణే ఆయన్ను గద్దె దించిందని తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన నారా లోకేశ్‌ అన్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమే ఈ విజయమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించడంతో.. గెలిచిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబును, లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నేతలు లోకేశ్‌కు డిక్లరేషన్‌ ఫాంలు చూపించారు. ‘‘ప్రజలు మనపై గురుతర బాధ్యత పెట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కృషి చేద్దాం. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిద్దాం’’ అని లోకేశ్‌ వారికి సూచించారు. ఉండవల్లికి వచ్చిన వారిలో నేతలు పితాని సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పంచుమర్తి అనురాధ, ధూళిపాళ్ల నరేంద్ర, అనగాని సత్యప్రసాద్, భాష్యం ప్రవీణ్, గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని