BJP: కమలదళానికి నష్టం అనుకున్న దానికంటే ఎక్కువా..?

2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు జరిగిన నష్టం ఎక్కువగానే ఉంది. కొత్త సీట్లు దక్కడంతో సంఖ్యాపరంగా దానిని కొంత తగ్గించుకోగలిగింది.  

Updated : 06 Jun 2024 17:03 IST

ఇంటర్నెట్‌డెస్క్: భాజపా (BJP) తనకు తగిలిన ఎదురుదెబ్బపై విశ్లేషించుకొనేకొద్దీ కీలక విషయాలు అర్థమవుతున్నాయి. ఆ పార్టీ 2019లో పోటీ చేసి విజయం సాధించిన వాటిల్లో దాదాపు మూడోవంతు స్థానాలు కోల్పోయింది. వాస్తవానికి గత ఎన్నికల్లో అత్యధికంగా ఆ పార్టీకి 77 రిజర్వుడు స్థానాలు దక్కాయి. 2014లో ఈ సంఖ్య కేవలం 48 మాత్రమే. జరిగిన నష్టంలో కొంత భాగాన్ని ఈసారి ఇతర ప్రాంతాల్లో విజయాలతో పూడ్చుకోగలిగింది. ఇప్పుడు పార్టీ వ్యూహకర్తలు జరిగిన లోపాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

2019లో భాజపా మొత్తం 303 స్థానాల్లో విజయం సాధించింది. వాటిల్లో ఈసారి 208 సీట్లను మాత్రమే నిలబెట్టుకొంది. 92 చోట్ల ఓడిపోయింది. మరో మూడు స్థానాలను జేడీయూ, జేడీఎస్‌, ఆర్‌ఎల్‌డీకి అప్పగించింది. కానీ, కొత్తగా మరో 32 స్థానాల్లో విజయం సాధించడంతో 240 అంకెను చేరుకొంది. 

భాజపా నష్టపోయిన వాటిల్లో..

  • 29 ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాలను కమల దళం కోల్పోయింది. 
  • 92 సీట్ల నష్టంలో ఒక్క యూపీ భాగమే 29 స్థానాలు.
  • ఇక మహారాష్ట్ర, రాజస్థాన్‌ పార్టీ 26 స్థానాల్లో ఓడిపోయింది. 
  • కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో ఒక్కోచోటా ఎనిమిది సీట్లను కోల్పోయింది. 
  • ఇక హరియాణలోని ఐదు నియోజకవర్గాలను కోల్పోవడంతో భాజపా బలం సగానికి తగ్గింది. 
  • బిహార్‌ (5), ఝార్ఖండ్‌(3), పంజాబ్‌(2), అస్సాం, చండీగఢ్‌, దామన్‌, గుజరాత్‌, లద్దాఖ్‌, మణిపుర్‌లో ఒక్కో స్థానం చొప్పున కోల్పోయింది. 
  • నష్టం జరిగిన మొత్తం 92 చోట్లలో జనరల్‌ కేటగిరీ స్థానాలు 63, ఎస్సీ రిజర్వు 18, ఎస్టీ 11 స్థానాలు ఉన్నాయి. 
  • ఇక పార్టీ నష్టపోయిన వాటిల్లో 11 సీట్లు అత్యంత పేదరికం ఉన్న ప్రాంతాలు. వీటిల్లో కాంగ్రెస్, ఎస్పీలే కమలదళాన్ని దెబ్బతీశాయి.
  • భాజపా కోల్పోయిన వాటిల్లో 42 కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి. వీటిల్లో అత్యధికంగా 9 మహారాష్ట్ర, 8 రాజస్థాన్‌, 4 యూపీలో ఉన్నాయి. 
  • కాషాయ దళాన్ని అత్యధికంగా దెబ్బతీసిన రెండో పార్టీ ఎస్పీ. ఇది మొత్తం 25 సీట్లను లాగేసుకొంది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు