Magunta: వైకాపాకు మరో షాక్‌.. ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా

వైకాపాకు మరో షాక్‌ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆ పార్టీని వీడారు.

Updated : 28 Feb 2024 16:39 IST

ఒంగోలు: వైకాపాకు మరో షాక్‌ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (magunta sreenivasulu reddy) ఆ పార్టీని వీడారు. వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

‘‘ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్‌. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. 11 సార్లు చట్టసభలకు పోటీ చేశా. మా కుటుంబానికి అహం లేదు.. ఉన్నదల్లా ఆత్మగౌరవమే. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైకాపాను వీడుతున్నాం. బాధాకరమే అయినా తప్పడం లేదు. ఒంగోలు ఎంపీ బరిలో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించాం’’ అని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. 

మాగుంట రాజీనామాతో కొద్దిరోజుల్లోనే ఆరుగురు ఎంపీలు వైకాపాను వీడినట్లయింది. వీరిలో ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, సంజీవ్‌కుమార్‌ (కర్నూలు), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), రఘురామకృష్ణరాజు (నర్సాపురం)తో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని