Maharashtra: మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటు కొలిక్కి.. కాంగ్రెస్‌కు 18 స్థానాలు..!

Maharashtra: కాంగ్రెస్‌, యూబీటీ, శరద్ పవార్ ఎన్సీపీ మధ్య సీట్ల పంపిణీ పూర్తయిందని, కొద్ది గంటల్లో ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

Published : 01 Mar 2024 10:15 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్ర(Maharashtra)లో ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీ(MVA)లో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. మొత్తం 48 లోక్‌సభ స్థానాలకుగానూ ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన(UBT) 20 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌ 18, శరద్‌పవార్ ఎన్సీపీ 10 చోట్ల అభ్యర్థులను బరిలో దించనుందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై అధికారికంగా కొద్ది గంటల్లో ప్రకటన వెలువడనుంది.

ఈ మూడు ప్రధాన విపక్ష పార్టీల మధ్య సీట్ల పంపిణీపై కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. 8 సీట్ల విషయంలో నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు తొలగిపోయిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ముంబయిలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో నాలుగు చోట్ల శివసేన(యూబీటీ) పోటీ పడనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఎంవీఏ మిత్రపక్షమైన వంచిత్ బహుజన్ అఘాడీ రెండు స్థానాల్లో బరిలో నిలవనుంది. ఆ సీట్లు ఠాక్రే పార్టీ వాటా నుంచి వెళ్లనున్నాయి. పవార్‌ పార్టీ తనకు దక్కిన 10 స్థానాల్లో ఒకదాన్ని స్వతంత్ర అభ్యర్థితో పంచుకోనుందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని