Mallu Ravi: ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా

దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్‌ నేత మల్లు రవి రాజీనామా చేశారు. 

Published : 23 Feb 2024 19:32 IST

హైదరాబాద్‌: దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్‌ నేత మల్లు రవి రాజీనామా చేశారు. ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకే పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. వారం క్రితమే రాజీనామా లేఖను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పంపినట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉంటానని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు