Mamata Banerjee: కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్‌ ఓటమి: మమత

ఇండియా కూటమి పార్టీలతో కలిసి రాకపోవడం వల్లే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. 

Updated : 04 Dec 2023 15:56 IST

కోల్‌కతా: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections 2023) ఫలితాలపై పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ‘ఇండియా’ (INDIA) కూటమిలోని పార్టీలతో కలిసి పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్‌ (Cogress) ఓటమి పాలైందని అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కోల్‌కతాలో మమత విలేకరులతో మాట్లాడారు. 

‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కూడా కాంగ్రెస్‌ గెలవాల్సింది. కానీ, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ ముందుకు రాలేదు. దీంతో ఓట్ల విభజన జరిగి ఆ పార్టీ ఓటమి పాలైంది. భావజాలంతోపాటు గెలిచేందుకు సరైన వ్యూహం, ప్రణాళిక కూడా ఉండాలి. 2024లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే కేంద్రంలో భాజపా అధికారంలోకి రాదు’’ అని మమత వ్యాఖ్యానించారు.

కుటుంబం బాధలో ఉన్నా.. పార్టీని గెలిపించారు: నడ్డాపై ప్రధాని ప్రశంసలు

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిత్రపక్షమైన తమకు ఒక్క స్థానం కూడా కేటాయించలేదని కాంగ్రెస్‌ పార్టీని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. కాంగ్రెస్ ఇదే రీతిగా వ్యవహరిస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి భాజపాను ఓడించలేదన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ కూడా ఒంటరిగా బరిలోకి దిగడంతో ఓట్ల విభజన జరిగి కాంగ్రెస్‌ ఓటమి పాలైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని