ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్‌ జోషీ

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Published : 19 May 2024 03:00 IST

దిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. హమీద్‌ అన్సారీ గురువారం, మన్మోహన్‌ సింగ్, మురళీ మనోహర్‌ జోషీ శుక్రవారం, ఆడ్వాణీ శనివారం ఇంటివద్ద నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. భారత ఎన్నికల కమిషన్‌ వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటి నుంచే ఓటేసే సౌకర్యాన్ని ప్రారంభించగా ఈ అవకాశం దిల్లీ ఓటర్లకు మే 16 (గురువారం) నుంచి మే 24 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో గురు, శుక్ర, శనివారాల్లో మొత్తం 5,406 మంది ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. మే 25న దిల్లీలో పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని