TS Eelections: తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు

తెలంగాణలో నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్‌ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.

Updated : 19 Apr 2024 15:44 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్‌ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. భారీ ర్యాలీలతో హోరెత్తించారు. కరీంనగర్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థిగా బండి సంజయ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున కుటుంబ సభ్యులు నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. హైదరాబాద్‌ లోక్‌సభ ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్‌ ఒవైసీ, నాగర్‌కర్నూల్‌ భారాస అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థిగా కిషన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. 

ఖమ్మం భాజపా అభ్యర్థి వినోద్‌రావు, పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణ, భారాస అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌, నిజామాబాద్‌ భారాస అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌, భువనగిరి సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్, భాజపా అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీ చంద్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

మరోఅవకాశం ఇవ్వండి: కిషన్‌రెడ్డి

నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. చివరి శ్వాస వరకు భాజపా జెండా కోసం పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణలో అన్ని పార్టీల కంటే భాజపా ఎక్కువ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, భాజపా మధ్యే పోటీ అని, భారాసకు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు అడిగే నైతికహక్కు లేదన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని