Delhi MCD Elections: దిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఆప్, భాజపా మధ్య హోరాహోరీ
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD Elections)లోని 250 వార్డులకు డిసెంబరు 4న పోలింగ్ జరిగింది. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల (MCD Elections) ఓట్ల లెక్కింపు బుధవారం కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో (Results) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భాజపా (BJP) మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. భాజపా కంటే ఆప్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఉదయం 9.30 గంటల వరకు ఆమ్ ఆద్మీ పార్టీ 126 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా.. భాజపా 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఆధిక్యం కేవలం 6 స్థానాలకే పరిమితమైంది.
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ MCD)లోని 250 వార్డులకు డిసెంబరు 4న పోలింగ్ జరిగింది. మొత్తం 1349 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. భారీ భద్రత మధ్య ఈ ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఈ ఫలితాల్లో ఆప్, భాజపా, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని భావించినా.. ప్రస్తుతం ఆప్, భాజపా మధ్యే పోటీ నెలకొంది.
1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. ఇది మే 22 నుంచి అమల్లోకి వచ్చింది. 2017 మున్సిపల్ ఎన్నికల్లో భాజపా 181 స్థానాల్లో గెలుపొందింది. ఆప్ 48, కాంగ్రెస్ 27 వార్డుల్ని కైవసం చేసుకున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: క్యాప్షన్ కోరిన దీపికా పదుకొణె.. హాయ్ చెప్పిన ఈషా!
-
Sports News
Gill - Prithvi Shaw: వన్డేలకు శుభ్మన్ గిల్.. టీ20లకు పృథ్వీ షా సరిపోతారు: గంభీర్
-
General News
AP High Court: గవర్నర్కు ఉద్యోగుల ఫిర్యాదు అంశంపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
Sports News
IND vs NZ: లఖ్నవూ ‘షాకింగ్’ పిచ్.. క్యురేటర్పై వేటు..!
-
Movies News
Multiverses: ఇండస్ట్రీ నయా ట్రెండ్.. సినిమాటిక్ యూనివర్స్
-
World News
Pakistan: ఆత్మాహుతి దాడిలో 93కు పెరిగిన మృతులు.. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఘటన