Ambati Rambabu: ‘మంత్రి అంబటి.. ప్రతి పనిలోనూ పర్సంటేజీలే’

మంత్రి అంబటి రాంబాబు ప్రతి పనికీ పర్సంటేజీలు వసూలు చేశారని, సంక్రాంతి సంబరాల పేరుతో తన వద్ద వరుసగా మూడేళ్లలో రూ.9 లక్షలు చందాగా తీసుకున్నారని వైకాపా ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు ఆరోపించారు.

Updated : 04 Apr 2024 07:18 IST

వైకాపా ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రాంబాబు ఆరోపణ

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: మంత్రి అంబటి రాంబాబు ప్రతి పనికీ పర్సంటేజీలు వసూలు చేశారని, సంక్రాంతి సంబరాల పేరుతో తన వద్ద వరుసగా మూడేళ్లలో రూ.9 లక్షలు చందాగా తీసుకున్నారని వైకాపా ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు ఆరోపించారు. సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పలుదేవర్లపాడులో పనికి రూ.3 లక్షలు పర్సంటేజీగా తీసుకున్నారని, జలవనరులశాఖకు సంబంధించి పనుల కోసం రూ.2.50 లక్షల వరకు షెడ్యూలు నగదు చెల్లిస్తే, తిరిగి ఇప్పించకపోగా తన బిల్లుల్ని అంబటి రాంబాబే తీసేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. చందా, పర్సంటేజీలు అంబటికి ఇచ్చానని ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని.. కాదని మంత్రి ప్రమాణం చేస్తారా అని సవాలు విసిరారు. గ్రామంలో రోడ్ల నిర్మాణానికి జడ్పీ ఛైర్మన్‌కు మంత్రి సిఫార్సు లేఖ కూడా ఇవ్వలేదన్నారు. గ్రామ పంచాయతీలో రూ.14 లక్షల నిధులున్నాయని ఎస్సీ కాలనీలో డ్రైన్లు నిర్మించగా.. ఆ సొమ్ములో రూ.12.80 లక్షలు విద్యుత్తు బిల్లులకే వెళ్లాయన్నారు. కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకునే నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అని, త్వరలో తెదేపాలో చేరతానని రాంబాబు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని