Jupally: భారాస హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరం: జూపల్లి

భారాస హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.

Updated : 24 May 2024 14:02 IST

హైదరాబాద్‌: భారాస హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య అంశంపై ఆ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉంది. గతంలో మా కార్యకర్తలు మరణించినప్పుడు నేను ఇలా ఆరోపణలు చేయలేదు. హత్యలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదు. శ్రీధర్‌రెడ్డికి ఆయన కుటుంబంలోనే తగాదాలున్నాయి. కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి వాళ్లు క్షమాపణలు చెప్పాలి’’ అని జూపల్లి డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని