Komatireddy: మూడు నెలల్లో భారాస దుకాణం బంద్‌: మంత్రి కోమటిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు.

Updated : 17 Apr 2024 14:00 IST

నల్గొండ: లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనం అవుతుందంటూ భారాస అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. తమను టచ్‌ చేస్తే భారాసను పునాదులతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. మూడు నెలల్లో ఆ పార్టీ దుకాణం బంద్‌ అవుతుందని.. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే వారికి మిగులుతారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. 12-13 సీట్లు తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో కేసీఆర్, కేటీఆర్‌ ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లిద్దరూ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం. చర్లపల్లి జైలులో డబుల్‌ బెడ్‌రూమ్‌ కట్టించి స్వాగతం పలుకుతాం’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని