భాజపా, భారాస ఒప్పందంలో భాగంగానే ఈడీ సోదాలు: మంత్రి కోమటిరెడ్డి

భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ చేపట్టిన సోదాలు పలు అనుమానాలకు తావిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 15 Mar 2024 19:28 IST

నల్గొండ: భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ చేపట్టిన సోదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వేళ సోదాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. ‘‘శనివారం నోటిఫికేషన్‌ వస్తున్న క్రమంలో ఈ దాడులేంటి? కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డే స్వయంగా.. కవిత అరెస్టు కాబోతోందని గతంలో చెప్పారు. ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు? భారాస, భాజపా నేతలు గల్లీలో కొట్టుకుంటారు.. దిల్లీలో దోస్తీ చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందడానికే.. ఇరుపార్టీల రహస్య ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు సోదాలు చేస్తున్నారు’’ అని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని